|  
FLASH NEWS
West Bengal News : మాల్డా ఆస్పత్రిలో 60 మంది పసిపాపల మృతి, దర్యాప్తులో షాకింగ్ నిజాలు  •  Sadhguru : ఇమ్మిగ్రేషన్ ఆఫీసు వద్దే ఆ 77 మంది గల్లంతు.. సద్గురు ఆవేదన వెనుక అసలు నిజం ఏంటి?  •  Tollywood Director Arrest : పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్… చంచల్‌గూడ జైలుకు తరలింపు  •  TOXIC Movie Review : ‘కేజీఎఫ్’ స్థాయి మ్యాజిక్ రిపీట్ అయిందా? యశ్ ‘టాక్సిక్’ సినిమా అసలు కథ మరియు పబ్లిక్ టాక్ ఇదే  •  Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!  • 
Skip to content

BRAOU Employees Protest : అంబేద్కర్ వర్సిటీలో భగ్గుమన్న ఉద్యోగులు.. నల్ల బ్యాడ్జీలతో నిరసన వెనుక అసలు కారణం ఇదే..

BRAOU Employees Protest
BRAOU Employees Protest

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) ప్రాంగణంలో ఉద్యోగుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన (Employees Protest) చేపట్టారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మరియు తుంటీయ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.

ప్రధాన డిమాండ్లు ఇవే..

పెండింగ్ లో ఉన్న పీఆర్సీకి వెంటనే ఆమోదం తెలపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు జారీ చేయాలి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు.

1000980624
BRAOU Employees Protest

నిరసనలో పాల్గొన్న ముఖ్య నాయకులు..

ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల అధికారులు వెంటనే స్పందించాలని నాయకులు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో తుంటీయ సెక్రటరీ జనరల్ మరియు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. తుంటియా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యకేష్ దైడా సైతం ఈ ఆందోళనలో భాగస్వాములు అయ్యారు. వీరితో పాటు విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నాయకులు మరియు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp