|  
● FLASH NEWS
ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో పతకం ఖాయం!  •  Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  •  NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  • 
Skip to content

Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు

సూర్య న్యూస్ స్పోర్ట్స్ డెస్క్ : ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్‌లో (Asian Games) భారత మహిళల హాకీ జట్టు (Indian Women’s Hockey) వరుస విజయాలతో సెమీ-ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. తాజాగా జపాన్‌తో జరిగిన కీలక పోరులో 3-1 గోల్స్ తేడాతో అద్భుత విజయం సాధించి పతకం దిశగా అడుగులు వేసింది.

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ గెలుపొందిన భారత మహిళల జట్టు పూల్-బిలో టాప్ జట్టుగా కొనసాగుతోంది. జపాన్‌పై తాజా విజయంతో మొత్తం 12 పాయింట్లు సాధించి అధికారికంగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆట ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన భారత క్రీడాకారిణులు సమష్టి కృషితో అద్భుతమైన ఆటతీరు కనబరిచారు.

హ్యాట్రిక్ విజయాలతో పురుషుల జట్టు

మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు కూడా ఈ టోర్నీలో అదరగొడుతోంది. ఇప్పటికే ఇండోనేషియా, శ్రీలంక, దక్షిణ కొరియా జట్లపై వరుస విజయాలు నమోదు చేసి హ్యాట్రిక్ కొట్టి మంచి ఫామ్‌లో ఉంది. విజయాల పరంపరను కొనసాగిస్తూ పురుషుల జట్టు తమ తదుపరి నాలుగో మ్యాచ్‌లో రేపు జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp