
సూర్య న్యూస్ డెస్క్ : ఏషియన్ గేమ్స్ (Asian Games)లో అదరగొడుతున్న భారత మహిళల జట్టు (Indian Women’s Team) అద్భుతమైన ఆటతీరుతో సత్తా చాటింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
సెమీ ఫైనల్ పోరులో భాగంగా 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు 15.4 ఓవర్లలో కేవలం 81 పరుగులకే కుప్పకూలి ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో నందినీ శర్మ, దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చెరో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించారు. అలాగే శ్రీచరణి రెండు వికెట్లు తీయగా.. క్రాంతి, శ్రేయాంక చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ అద్భుత విజయంతో టైటిల్ పోరుకు సమాయత్తమైన టీమ్ ఇండియా, ఈ నెల 22వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో తలపడనుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



