|  
FLASH NEWS
Election Commission SIR Notices : అద్వానీ, జైశంకర్ సహా కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు.. అసలేమిటీ ‘సర్’ (SIR) ప్రక్రియ?  •  Houthi Attacks on Saudi Arabia : సౌదీ అరేబియాపై హౌతీ రెబల్స్ భీకర దాడులు.. పాకిస్థాన్, తుర్కియేలకు తీవ్ర హెచ్చరికలు!  •  Rahul Gandhi Comments : లక్షకు పైగా ప్రభుత్వ బడులు మూతబడ్డాయి.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!  •  NSA Ajit Doval : నా కెరీర్ అక్కడితో ముగిసిందనుకున్నా.. తన ఏజెంట్లను చైనా బంధించిన నాటి ఘటనపై అజిత్ దోవల్!  •  మోదీ, నేను, పవన్ ఉన్నంతవరకు అవినీతి జరగనివ్వం.. డీఎస్సీపై సీఎం ఫైర్!  • 
Skip to content

Maksh Global Foundation : హైదరాబాద్‌లో ఘనంగా సౌత్ ఇండియా అవార్డ్స్.. పాల్గొన్న డాక్టర్ రియాజ్, కల్వ సుజాత

హైదరాబాద్, సూర్య న్యూస్ : నగరంలో మాక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ (Maksh Global Foundation) ఆధ్వర్యంలో ఐదో సీజన్ ‘సౌత్ ఇండియా అవార్డ్స్-2026’ ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ (Dr Riyaz) ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేశారు.

డాక్టర్ రియాజ్‌కు ‘గ్లోబల్ యూత్ ఐకాన్’

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ రియాజ్‌కు ఈ వేదికపై అరుదైన సత్కారం దక్కింది. విద్యార్థులకు, యువతకు ఆయన అందిస్తున్న విశేష సేవలకు, శిక్షణకు గుర్తింపుగా ఫౌండేషన్ నిర్వాహకులు ఆయనను ‘గ్లోబల్ యూత్ ఐకాన్’ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, స్వయంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

గౌరవ అతిథిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత

​ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ తొలి చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్త గౌరవ అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆమెను చైర్‌పర్సన్‌గా నియమించింది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం మాజీ ట్రెజరర్‌గా సేవలందించిన ఆమె, వాసవి మాత కార్యక్రమాల్లో, సమాజ సంక్షేమంలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు.

రాము రాథోడ్, రేలారే గంగలకు సత్కారం

రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ ఫోక్ సాంగ్ ‘రాను ముంబైకి రాను’ పాట ద్వారా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ నటుడు, జానపద గాయకుడు రాము రాథోడ్‌కు ఈ వేడుకలో జానపద పరిశ్రమ విభాగంలో ‘గ్లోబల్ యూత్ ఐకాన్’ పురస్కారం వరించింది. ముఖ్య అతిథి డాక్టర్ రియాజ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును సంతోషంగా అందుకున్నారు. అలాగే ప్రముఖ జానపద గాయని రేలారే గంగను సైతం ఈ వేదికపై అవార్డు ప్రదానం చేసి ప్రత్యేకంగా సత్కరించారు.

విశిష్ట సేవలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు

మహిళా ఉపాధి కల్పనతో పాటు చేనేత వృత్తుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న విశాఖపట్నానికి చెందిన వ్యాపారవేత్త వెంకటరావుకు ఫౌండేషన్ ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ (జీవిత సాఫల్య) పురస్కారాన్ని ప్రదానం చేసింది. అలాగే డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా ఎంతో మందిని వ్యసనాల నుంచి దూరం చేస్తూ సన్మార్గంలో నడిపిస్తున్న పార్వతమ్మకు కూడా ఈ వేడుకలో అవార్డు అందజేశారు. ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అవార్డు గ్రహీతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp