|  
● FLASH NEWS
CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  •  Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక రజతం  •  Banks: ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్!  •  CBSE : ముదురుతున్న ‘ఓఎస్‌ఎం’ వివాదం.. నాలుగు నెలల్లో మూడో బాస్ నియామకం  •  Chandrababu : మత్స్యకారులకు సీఎం చంద్రబాబు వరం.. ఏకంగా 50 కిలోలు ఉచితం  • 
Skip to content

CBSE : ముదురుతున్న ‘ఓఎస్‌ఎం’ వివాదం.. నాలుగు నెలల్లో మూడో బాస్ నియామకం

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఛైర్‌పర్సన్‌గా ఐఏఎస్ అధికారి మన్‌దీప్ భండారి నియమితులయ్యారు. ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM System) విధానంలో తలెత్తిన తీవ్ర వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలో సీబీఎస్ఈకి మూడోసారి కొత్త చీఫ్ రావడం విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పార్లమెంటరీ కమిటీ సీరియస్.. ఆపై వేటు

క్లాస్-12 జవాబు పత్రాల మూల్యాంకనంలో ఓఎస్‌ఎం పనితీరుపై విద్యార్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, అప్పటి బోర్డు చీఫ్ రాహుల్ సింగ్‌తో పాటు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) డీజీకి సమన్లు జారీ చేసి విచారణకు ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య జూన్‌లో రాహుల్ సింగ్‌ను తొలగించిన కేంద్రం, ప్రశాంత్ సీతారామ్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆ స్థానంలో అడిషనల్ సెక్రటరీ హోదాతో మన్‌దీప్ భండారికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది.

మళ్లీ అదే సాఫ్ట్‌వేర్.. హైదరాబాద్ సంస్థపై ఆరోపణలు

వివాదాస్పదమైన ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని హైదరాబాద్‌కు చెందిన ‘కోఎంప్ట్’ అనే ఎడ్యుటెక్ సంస్థ రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లోని లోపాల వల్లే మూల్యాంకనంలో భారీ పొరపాట్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, 12వ తరగతి ఆన్సర్ షీట్ల రీవాల్యుయేషన్ కోసం సీబీఎస్ఈ మళ్లీ అదే టూల్‌ను ఉపయోగించడం గమనార్హం. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని బోర్డు అధికారులు చెబుతుండగా, రీవాల్యుయేషన్ ఫలితాలు ఈ నెలాఖరులోగా వెలువడే అవకాశం ఉంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp