|  
● FLASH NEWS
Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి  •  Netanyahu: ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని  •  HistoricWin: 406 పరుగుల రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన భారత్  •  PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  •  Archery: ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల హవా.. రెండు స్వర్ణాలు కైవసం  • 
Skip to content

Record: 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి వన్డేల్లో భారత్ సరికొత్త రికార్డు

సూర్య న్యూస్ డెస్క్ : వన్డే క్రికెట్ (ODI Cricket) చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో (West Indies) గువహటి వేదికగా జరిగిన రెండో వన్డేలో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. కేవలం 29.1 ఓవర్లలోనే 300 పరుగుల మార్కును చేరుకుని చరిత్ర సృష్టించింది. 148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఇంత వేగంగా 300 పరుగులు చేయడం ఇదే తొలిసారి.

ఈ మ్యాచ్‌లో 406 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ జోడీ 10 ఓవర్లలోనే 92 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి 21.1 ఓవర్లలోనే 200 పరుగుల మైలురాయిని అందుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది. తొలి వికెట్‌కు 255 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత రోహిత్ శర్మ 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

శుభమన్ గిల్ డబుల్ సెంచరీ

రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ సైతం దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు శుభమన్ గిల్ బౌండరీల మోత మోగిస్తూ 130 బంతుల్లో 25 ఫోర్లు, 8 సిక్స్‌లతో 217 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 29.1 ఓవర్లలోనే (175 బంతుల్లో) 300 పరుగుల మైలురాయిని అందుకుంది. చివరికి మరో 39 బంతులు మిగిలి ఉండగానే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి టీమిండియా రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది.

బద్దలైన పాత రికార్డులు

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 పరుగులు చేసిన జట్టుగా నిలిచిన భారత్ పాత రికార్డులన్నింటినీ బద్దలుకొట్టింది. గతంలో 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 300 పరుగులు సాధించడమే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. అలాగే 2006లో శ్రీలంకపై ఇంగ్లండ్ 33.1 ఓవర్లలో, 2009లో శ్రీలంకపై భారత్ 34.1 ఓవర్లలో 300 పరుగులు చేశాయి.

సిరీస్ టీమిండియా కైవసం

ఈ అద్భుత విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు ఆఖరి వన్డే శనివారం న్యూ చండీఘడ్ వేదికగా జరగనుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp