|  
● FLASH NEWS
Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి  •  Netanyahu: ఫ్లైదుబాయ్ విమానం ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని  •  HistoricWin: 406 పరుగుల రికార్డు ఛేదనతో చరిత్ర సృష్టించిన భారత్  •  PuneMurder: కేతన్ హత్య కేసులో సంచలనం.. మేఘాలయ హనీమూన్ మర్డర్ స్ఫూర్తితోనే స్కెచ్  •  Archery: ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల హవా.. రెండు స్వర్ణాలు కైవసం  • 
Skip to content

Gachibowli: ప్రముఖ హోటల్‌లో హైటెక్ వ్యభిచారం, విదేశీ యువతులు సహా ఆరుగురు అదుపులోకి

హైదరాబాద్, సూర్య న్యూస్ : నగరంలోని గచ్చిబౌలిలో (Gachibowli) ఉన్న ఫ్యాబ్‌హోటల్ డ్రీమ్ ప్రైడ్‌లో విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలపై పోలీసులు (Police) దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఢిల్లీకి చెందిన నిఖిల్, రామ్మోహన్ రెడ్డి నిర్వాహకులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు హర్షిత్ సింఘానియా అనే వ్యక్తిని, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఉన్న ముగ్గురు విదేశీ మహిళలకు పాస్‌పోర్ట్, వీసాలు చెల్లుబాటులోనే ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వీరు కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. రూ. 13 వేల నగదు, 23 వాడిన కాండమ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే రామ్మోహన్ రెడ్డి నుంచి రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp