|  
● FLASH NEWS
INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  •  Quthbullapur: బహుజన వర్గాల ఐక్యతే లక్ష్యం.. సురేష్ గౌడ్‌కు ఘన సన్మానం  •  Dubai : హీరో స్మిత్‌కు ఆత్మీయంగా ముద్దుపెట్టిన దుబాయ్ ప్రిన్స్.. ప్రశంసించిన ఐఏఎఫ్ చీఫ్  •  BAPS: ఈఫిల్ టవర్ వివాదంలో బీఏపీఎస్‌కు ఊరట.. అసలేం జరిగింది?  • 
Skip to content

Telangana ACB Raids : తెలంగాణలో ఏసీబీ భారీ వేట.. డీఎస్పీ ఇంట్లో 200 కోట్ల కుబేర గుట్టు రట్టు, దొరికిన డైరీలో సంచలన నిజాలు

హైదరాబాద్, సూర్య న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల (Disproportionate Assets) కేసులో డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డి (DSP Sankireddy Bheem Reddy) ఇళ్లు, బినామీల కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల (Market Value) విలువైన అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. జూలై 2న ఉదయం నుంచి ఏసీబీ (Telangana ACB) అధికారులు ఏకకాలంలో 16 చోట్ల ఈ సోదాలు చేశారు. హైదరాబాద్ (Hyderabad), జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మోమిన్‌పేట్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి.

డీఎస్పీ (DSP) నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తుల చిట్టా బయటపడింది. ఇబ్రహీంబాగ్‌లో అత్యంత ఖరీదైన వెసెల్లా మెడోస్ విల్లా (Vessella Meadows), తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు, గచ్చిబౌలి (Gachibowli), టెలికామ్‌నగర్ ప్రాంతాల్లో పలు అపార్ట్‌మెంట్లు గుర్తించారు. అలాగే లాంకో హిల్స్ (Lanco Hills) రోడ్డులో వాణిజ్య సముదాయం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. జహీరాబాద్‌లో 3.5 ఎకరాలు, కర్ణాటక రాష్ట్రంలో 44 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు, బెంగళూరు (Bengaluru) సమీపంలోని దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి, ముచ్చింతల్‌లో 4.2 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. వీటితో పాటు నాగోల్, పటాన్‌చెరు, మోమిన్‌పేట్‌లలో ఖరీదైన ప్లాట్లు, శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ.75 లక్షల పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

డీఎస్పీ నివాసం నుంచి రూ.3.6 లక్షల నగదు, ఒక బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు (Cash) స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు (Gold Ornaments), 20 కిలోల వెండి వస్తువులు దొరికాయి. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.19.91 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 23 బాటిళ్ల విదేశీ మద్యం దొరకడంతో ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులకు సమాచారం అందించారు. ఈ కేసులో డీఎస్పీ భార్య వద్ద దొరికిన ఒక డైరీ (Benami Diary) అత్యంత కీలకంగా మారింది. ఇందులో బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల పూర్తి జాబితా లభించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

అయితే ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో డీఎస్పీ భీమ్ రెడ్డికి రక్తపోటు (Blood Pressure) 170/120కి పెరిగింది. వెంటనే అధికారులు వైద్యుడిని పిలిపించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనను అరెస్టు చేయకుండా, కుటుంబ సభ్యులకు అప్పగించి ఏసీబీ పర్యవేక్షణలోనే వైద్యం అందిస్తున్నారు. సంకిరెడ్డి భీమ్ రెడ్డి ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో సంగారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో ఎస్ఐ, ఇన్స్‌పెక్టర్, ఏసీపీ తదితర హోదాల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. సోదాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp