|  
● FLASH NEWS
EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  • 
Skip to content

Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్

విశాఖపట్నం, సూర్య న్యూస్ : దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన ఓ ఇండియన్ నేవీ (Indian Navy) ఉద్యోగిని ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ (AP Counter Intelligence) పోలీసులు అరెస్టు చేశారు. పాక్ మహిళా ఏజెంట్ పన్నిన హనీ ట్రాప్ వలలో పడి అతడు ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 31 ఏళ్ల ప్రదీప్ ముఖర్జీ 2014లో నేవీలో సెయిలర్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అతడు విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఒక పాకిస్థాన్ మహిళా ఏజెంట్ పరిచయం కావడంతో ఆమె మాటల వలలో పడిపోయాడు.

ఆమెకు ఆకర్షితుడైన ప్రదీప్ ముఖర్జీ, వైజాగ్ నేవల్ బేస్‌కు సంబంధించిన అత్యంత రహస్యమైన వివరాలను లీక్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp