
ముంబై, సూర్య న్యూస్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన రక్షాబంధన్ పండుగ నాడు బికినీ తరహా డ్రెస్ ధరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి కృతి సనన్ (Kriti Sanon), తాజాగా తన వస్త్రధారణను సమర్థించుకున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఇటీవల కరీనా కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘వాట్ ఉమెన్ వాంట్’ షోలో (What Women Want) పాల్గొన్న కృతి సనన్.. తన డ్రెస్సు గురించి ప్రైమ్ టైమ్ న్యూస్‌లో ఆరుగురు సభ్యుల ప్యానెల్‌తో చర్చ జరగడాన్ని తాను నమ్మలేకపోయానని పేర్కొన్నారు. మహిళలను జడ్జ్ చేయకుండా ఎవరి పని వారు చూసుకుంటే బాగుంటుందని, దుస్తుల విషయంలో తన స్వేచ్ఛను ప్రశ్నించడం సరికాదన్నట్లుగా ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఇక్కడే ఒక సహజమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అత్యంత పవిత్రమైన రాఖీ పండుగను, ఒక బికినీ మోడల్ డ్రెస్ వేసుకుని జరుపుకుంటే.. సమాజంలో అది కచ్చితంగా ప్రైమ్ టైమ్ న్యూస్ అవుతుంది. ఒక సంప్రదాయాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించి, దానిని ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ పేరుతో సమర్థించుకోవడం న్యూస్ కాక ‘న్యూసెన్స్’ అవుతుందని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పండుగల పవిత్రతను గౌరవించకుండా, నా బట్టల మీద మీకేంటి అధికారం అని ఎదురుదాడికి దిగడం హాస్యాస్పదంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
అసలేం జరిగిందంటే?
గతంలో ఒక జువెలరీ బ్రాండ్ రాఖీ పండుగ కోసం రూపొందించిన యాడ్‌లో కృతి సనన్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్ (బికినీ మోడల్) వేసుకుని కనిపించారు. పండుగ వాతావరణంలో సంప్రదాయబద్ధంగా ఉండాల్సిన వస్త్రధారణకు బదులు ఇలాంటి దుస్తులు ధరించడం, పైగా సోదరులకు కట్టే రాఖీని ఒక పెంపుడు కుక్కకు కట్టడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.
సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో సదరు జువెలరీ బ్రాండ్ వెనక్కి తగ్గి ఆ వివాదాస్పద యాడ్‌ను తొలగించింది. భారతీయ సంస్కృతి, పండుగలపై తమకు గౌరవం ఉందని, పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలనే ఉద్దేశంతోనే అలా చేశామని వివరణ ఇస్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది. ముగిసిపోయిన ఆ పాత వివాదాన్ని తాజాగా కృతి సనన్ ఇంటర్వ్యూలో మళ్లీ ప్రస్తావించి తన స్వేచ్ఛను సమర్థించుకునే ప్రయత్నం చేయడంతో ఈ వ్యవహారం మరోసారి విమర్శనాత్మక చర్చకు దారితీసింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



