
న్యూయార్క్, సూర్య న్యూస్ డెస్క్ : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా (Tesla) అద్భుత ఆవిష్కరణను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. రోడ్డుపై ప్రయాణిస్తూనే గాల్లోకి ఎగిరే అధునాతన ‘రోడ్‌స్టర్’ (Roadster) స్పోర్ట్స్ కారును కంపెనీ అట్టహాసంగా ప్రదర్శించింది. రోడ్డుపై వెళ్తున్న కారు అమాంతం గాల్లోకి ఎగిరి, పల్టీలు కొట్టి సురక్షితంగా మళ్లీ కిందకు వాలిన ఈ అద్భుత వీడియోను టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు.
ప్రపంచంలోనే తొలిసారిగా ఈ గాల్లో ఎగిరే కారును రూపొందించేందుకు టెస్లా సంస్థ అంతరిక్ష సాంకేతికతను వాడింది. శాటిలైట్లు అంతరిక్షంలో తమ దిశను మార్చుకోవడానికి ఉపయోగించే ‘కోల్డ్ గ్యాస్ థ్రస్టర్ల’ను ఈ కారులో ప్రత్యేకంగా అమర్చారు. ఇవి అధిక పీడనంతో గ్యాస్‌ను నిల్వ చేసి, చిన్న నాజిల్ ద్వారా అత్యంత వేగంగా కిందకు విడుదల చేస్తాయి.
న్యూటన్ మూడవ గమన సూత్రం ఆధారంగా ఈ సాంకేతికత పనిచేస్తుంది. నాజిల్స్ నుంచి బయటకు బలంగా విడుదలయ్యే గ్యాస్ ఒత్తిడికి వాహనం అమాంతం పైకి నెట్టబడుతుంది. ఈ ప్రక్రియలో థ్రస్టర్ల నుంచి ఎటువంటి మంటలు వెలువడవు. ఊహకు అందని రీతిలో విన్యాసాలు చేసిన ఈ ఫ్లయింగ్ టెస్లా వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



