
ఢిల్లీ, సూర్య న్యూస్ : ఆన్లైన్ భద్రత పేరుతో పిల్లలను ఇంటర్నెట్కు పూర్తిగా దూరం చేయడం ఏమాత్రం సరికాదని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కులలో (Fundamental Rights) ఒకటని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇతర ఆన్లైన్ సేవల్లో పిల్లలపై జరుగుతున్న లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ను వేగంగా గుర్తించి, వాటిని తొలగించే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కఠిన ఆదేశాలు జారీ చేసే క్రమంలోనే పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్లో తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు, స్వేచ్ఛగా ఇతరులతో పంచుకునేందుకు పిల్లలకు పూర్తి హక్కు ఉందని కోర్టు గుర్తుచేసింది. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఆన్లైన్ ద్వారా భావప్రకటనా స్వేచ్ఛను పొందే హక్కు ప్రతి చిన్నారికి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



