
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram) విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. వందేమాతరం గీతంలోని ఆరు చరణాలను పూర్తిగా పాడటం ఎవరికీ తప్పనిసరి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. గీతంలో ఎన్ని చరణాలు పాడాలన్నది పూర్తిగా ఆయా వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయమని, అన్ని చరణాలు పాడలేదనే నెపంతో వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని కోర్టు తేల్చిచెప్పింది.
వందేమాతరం గీతంలోని ఆరు చరణాల ఆలాపనను తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ సంగీత విద్వాంసుడు టి.ఎం.కృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం పై విధంగా స్పందించింది. గీత ఆలాపన విషయంలో ఎవరిపైనా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని స్పష్టం చేసింది.
కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సైతం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వందేమాతరం సవరణ చట్టం, అలాగే గీత ఆలాపనకు సంబంధించిన మార్గదర్శకాలపై రెండు వారాల్లోగా తమకు సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



