|  
● FLASH NEWS
Diplomacy: జైశంకర్ దౌత్య వ్యూహం.. యూఎస్ విదేశాంగ మంత్రి ముందే పాక్ గుట్టు రట్టు  •  SupremeCourt: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువుపై కీలక ఆదేశాలు  •  PayalRajput: నా శరీరం నా ఇష్టం.. ట్రోలర్స్‌పై మండిపడ్డ హీరోయిన్ పాయల్  •  Warning: రౌడీలు, సోషల్ మీడియా సైకోల తాట తీయాలి.. పోలీసులకు సీఎం చంద్రబాబు వార్నింగ్  •  ParaGames: ఏషియన్ పారా గేమ్స్‌లో పతకాల పంట.. గోల్డ్ కొట్టిన తెలంగాణ అథ్లెట్ దీప్తి  • 
Skip to content

Diplomacy: జైశంకర్ దౌత్య వ్యూహం.. యూఎస్ విదేశాంగ మంత్రి ముందే పాక్ గుట్టు రట్టు

ముంబై, సూర్య న్యూస్ : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి తన అద్భుత దౌత్య వ్యూహాన్ని (Diplomatic Strategy) ప్రదర్శించారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు (Marco Rubio) 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన భీభత్సాన్ని, విధ్వంసాన్ని జైశంకర్ స్వయంగా వివరించారు.

తాజ్ హోటల్ మాజీ సెక్యూరిటీ చీఫ్‌తో భీకర క్షణాల వివరణ

ముంబై దాడుల తీవ్రతను అమెరికా ప్రభుత్వ ప్రతినిధికి కళ్లకు కట్టినట్లు చూపించేందుకు జైశంకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాటి ఉగ్రదాడిని స్వయంగా చూసిన తాజ్ హోటల్ మాజీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ కుద్యాదితో నేరుగా మార్కో రూబియోకు ఆనాటి భయంకర పరిణామాలను పూసగుచ్చినట్లు చెప్పించారు. పాక్ కేంద్రంగా సాగిన ఆ దాడిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించి పాక్ ఉగ్రవాద మూలాలను పక్కా ఆధారాలతో అమెరికా ముందుంచారు.

అంతకుముందు ముంబై చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ను సందర్శించారు. అనంతరం 26/11 ఉగ్రదాడిలో అసువులు బాసిన మృతులకు తాజ్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. ఈ నెల 22 వరకు భారత్‌లో పర్యటించనున్న రూబియో, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక అంశాలపై భారత విదేశాంగ మంత్రితో మరిన్ని చర్చలు జరపనున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp