
సూర్య న్యూస్ డెస్క్ : దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) అణు బెదిరింపులకు పాల్పడితే ఇకపై సహించేది లేదని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. డిఫెన్స్ కాన్ఫరెన్స్ (DEFCON-2026) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
శత్రుపూరిత చర్యలు ఇక చెల్లవు
పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి శత్రుపూరిత చర్యలకైనా దీటుగా బదులిస్తామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాక్ దుశ్చర్యలకు పాల్పడితే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని, ఆ స్థాయిలోనే భారత్ రియాక్షన్ ఉంటుందని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు ఎప్పటికీ కలిసి సాగలేవని.. అదేవిధంగా ఉగ్రవాదంతో పాటు వాణిజ్యం కూడా కొనసాగించడం అసాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు.
రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు
ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూనే మరోవైపు జల ఒప్పందాల గురించి మాట్లాడే పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని రాజ్‌నాథ్ సింగ్ ఎండగట్టారు. “రక్తం, నీరు ఒకేసారి కలిసి ప్రవహించలేవు.. సింధూ జలాల నిలిపివేతతో ఈ విషయాన్ని మేం సుస్పష్టం చేశాం” అని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల ఆవల నుంచి ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే భారత ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందో గత పరిణామాలు నిరూపించాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



