|  
● FLASH NEWS
Warning: పాకిస్థాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు  •  Balapur: బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త రికార్డ్.. ఏకంగా రూ.39 లక్షలు పలికిన ప్రసాదం  •  ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో పతకం ఖాయం!  •  Hockey: ఏషియన్ గేమ్స్‌లో జపాన్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు  •  Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  • 
Skip to content

Pakistan Nuclear Control : అసిమ్ మునీర్ చేతికి ‘అణు బటన్’.. పాకిస్థాన్‌లో మారిన బిగ్ పవర్ గేమ్!

Islamabad, Surya News: దాయాది దేశం పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం పేరుకే ఉన్నప్పటికీ, అంతర్గతంగా సైనిక పాలన (Military Rule) నడుస్తోందనేది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు అది పూర్తిస్థాయిలో అధికారికం కాబోతోంది. పాకిస్థాన్‌ తెస్తున్న 27వ రాజ్యాంగ సవరణ (27th Constitutional Amendment) ద్వారా దేశం మొత్తం పాక్ ఆర్మీ చీఫ్ (Army Chief) ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేతుల్లోకి వెళ్తోంది. ఈ కొత్త రాజ్యాంగ సవరణ ఫలితంగా దేశంలోని అణ్వాయుధాలపై (Nuclear Weapons) పూర్తి ఆధిపత్యం, నియంత్రణ అసిమ్ మునీర్ చేతికే రాబోతున్నాయి.

​ఈ నూతన చట్ట సవరణలో భాగంగా ‘నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్’ (National Strategic Command – NSC) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశంలోని అణ్వాయుధ నిల్వలు, వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలు, వాటి నిర్వహణను ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది. ఇప్పటివరకు అణ్వాయుధాల వినియోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నేతృత్వంలోని నేషనల్ కమాండ్ అథారిటీ (National Command Authority – NCA) వద్ద ఉండేది. కానీ కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే ప్రధానమంత్రి (Prime Minister) పాత్ర కేవలం సమాచారం తెలుసుకునే స్థాయికే పరిమితమవుతుంది. తుది నిర్ణయాధికారం పూర్తిగా సైన్యానిదే కానుంది.

ప్రస్తుతం అసిమ్ మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF), చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) అనే రెండు అత్యున్నత బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ కొత్త వ్యవస్థ రూపురేఖలు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA Rocket Force) నమూనాను పోలి ఉంటాయి. స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ (Strategic Plans Division – SPD) సహకారంతో క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, అణు నిల్వల పర్యవేక్షణను ఒకే కమాండ్ కిందకు తేవడం, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మధ్య సమన్వయాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యం. అలాగే తూర్పు సరిహద్దు వద్ద వ్యూహాత్మక నిరోధక శక్తిని బలపరచడంతో పాటు చైనా సాంకేతికతను (Chinese Technology) సైన్యంలో మరింత పెంచాలని భావిస్తున్నారు.

మరోవైపు పాక్ సైన్యంలో జరుగుతున్న ఈ భారీ పునర్వ్యవస్థీకరణ కారణంగా గత 15 నెలలుగా సీనియర్ సైనికాధికారుల పదోన్నతులు (Promotions) నిలిచిపోయాయి. 2024 నుంచి ఫార్మేషన్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. దీనితో పాకిస్థాన్ సైన్యంలో అత్యున్నత నాయకత్వం వద్దే నిర్ణయాధికారం పూర్తిగా కేంద్రీకృతమవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp