|  
FLASH NEWS
CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్.. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ అంటూ విమర్శలు  •  YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  • 
Skip to content

Balochistan Independence : పాకిస్థాన్‌కు భారీ షాక్.. స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. కొత్త దేశం ఆవిర్భావం..

Hyderabad, Surya News: ప్రపంచ పటంలో మరో కొత్త దేశం ఆవిర్భవించింది. పాకిస్థాన్ (Pakistan) నుంచి తాము వేరు పడినట్లు బలూచిస్థాన్ (Balochistan) సంచలన ప్రకటన చేసింది. తమను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి బలూచిస్థాన్ విజ్ఞప్తి చేసింది. భౌగోళికంగా పాకిస్థాన్‌లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్థాన్ దాదాపు 44 శాతం భూభాగాన్ని కలిగి ఉంది. ఒకవైపు ఇరాన్ (Iran), మరోవైపు అఫ్గానిస్థాన్ (Afghanistan) సరిహద్దులతో ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం.

ఈ ప్రాంతం బంగారం, రాగి, సహజ వాయువు వనరులతో సమృద్ధిగా ఉంది. అయినప్పటికీ దశాబ్దాలుగా అక్కడి ప్రజలు తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. 1947లో భారతదేశ విభజన నాటికి బలూచిస్థాన్‌లో కలాత్ ఖనాట్ (Kalat Khanate) అనే స్వతంత్ర రాజ్యం ఉండేది. దానిని 1948లో పాకిస్థాన్ బలవంతంగా తనలో కలిపేసుకుంది. అప్పటినుంచి అక్కడి సంపదను పాక్ పాలకులు దోచుకుంటూ స్థానిక ప్రజలను దారిద్య్రంలోకి నెట్టేశారు. దీనికి తోడు చైనా (China) నిర్మిస్తున్న సీపెక్ ప్రాజెక్టుల వల్ల బలూచ్ ప్రజలు తమ సొంత నేలపైనే పరాయివాళ్లుగా మారుతున్నారు.

​ఈ అణచివేతకు వ్యతిరేకంగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army) వంటి సాయుధ సంస్థలు పాక్ సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తున్నాయి. ప్రస్తుతం బలూచిస్థాన్‌లో 85 శాతం భూభాగం తమ బలగాల ఆధీనంలో ఉన్నట్టు వారు ప్రకటించారు. ‘మా చుకైన్ బలోచ్’ (Macheken Baloch) పేరుతో జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని వారు ఆవిష్కరించారు. దేశ కరెన్సీగా ‘బలోచి ఫాల్స్’ను (Balochi Fals) ఖరారు చేసుకున్నారు. తమ భూభాగంలోని బంగారం, రాగి గనులు, 150కి పైగా గ్యాస్ క్షేత్రాలు, 1200 బొగ్గు గనులపై తమ నియంత్రణే కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. తమ వద్ద భారీ యుద్ధ విమానాలు లేకపోయినా 5 లక్షల మందితో కూడిన సైన్యం, నావికాదళం, వాయు బలగాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా పాకిస్థాన్ దళాలను తరిమికొట్టగలం అని ధీమా వ్యక్తం చేశారు.

అయితే తన దేశంలోని అంతర్గత వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ ఎప్పటిలాగే కుక్క తోక వంకర అన్నట్లు వ్యవహరిస్తోంది. బలూచిస్థాన్ తిరుగుబాటు వెనుక భారత నిఘా సంస్థ ‘రా’ (RAW) హస్తం ఉందంటూ పాత పల్లవి అందుకుంది. దీనిపై భారత్ (India) తన పంథాను స్పష్టం చేసింది. బలూచిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై తాము ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు భారత్ తెలిపింది. అక్కడ జరుగుతున్న అంతర్గత తిరుగుబాట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. పాక్ తన తప్పులను ఇతరులపై నెట్టేయడం మానుకోవాలని హితవు పలికింది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp