Skip to content
Home » నందమూరి ఫ్యామిలీపై అలేఖ్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు: మూడేళ్ల మౌనం వీడి అసలు నిజాలు బయటపెట్టిన తారకరత్న భార్య

నందమూరి ఫ్యామిలీపై అలేఖ్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు: మూడేళ్ల మౌనం వీడి అసలు నిజాలు బయటపెట్టిన తారకరత్న భార్య

హైదరాబాద్, సూర్య న్యూస్ : నందమూరి తారకరత్న మరణించి మూడేళ్లు గడుస్తున్నా ఆయన భార్య అలేఖ్య రెడ్డికి మరియు నందమూరి కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న దూరం ఇంకా తగ్గలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి, తన కుటుంబ విషయాలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అలేఖ్య రెడ్డి తొలిసారిగా ఒక ఇంటర్వ్యూలో బయటకు వచ్చి నందమూరి ఫ్యామిలీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశారు.

తమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదనే ప్రచారంలో నిజం లేదని మరియు తన ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి అంగీకరించారని అలేఖ్య స్పష్టం చేశారు, తారకరత్న మరణం తర్వాత నందమూరి కుటుంబం నుంచి ఆశించిన మద్దతు లభించలేదని కనీసం తన పిల్లలకు తగిన ప్రేమ మరియు గౌరవం దక్కడం లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, పిల్లలు చేసిన చిన్న తప్పులను కూడా వారు పెద్దది చేసి కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

రాజకీయాల్లోకి వస్తారనే వార్తలను సైతం ఆమె ఖండించారు, తనను ఎవరూ రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయడం లేదని మరియు తనకు ఆ ఆలోచన కూడా లేదని ఆమె తేల్చి చెప్పారు, తన జీవితం పూర్తిగా పిల్లల భవిష్యత్తుపైనే ఆధారపడి ఉందని చెబుతూ నందమూరి కుటుంబం ఏదో ఒక రోజు మారుతుందని తాను ఇన్నాళ్లు ఎదురుచూశానని అన్నారు, తన వంతుగా వారితో కలిసిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని తన ప్రయత్నం పూర్తయింది కాబట్టి ఇక తాను వేరే దారి చూసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె ఎమోషనల్ గా వ్యాఖ్యానించారు.

2023 జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై ఫిబ్రవరి 18న బెంగళూరులో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే, అప్పటి నుంచి పిల్లలతో ఒంటరిగా ఉంటున్న అలేఖ్య రెడ్డి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు నందమూరి కుటుంబంలోని అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి, అయితే అలేఖ్య రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై నందమూరి ఫ్యామిలీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూద్దాం.

source :

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.