
అమరావతి, సూర్య న్యూస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees), పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రెండు కరువు భత్యాల (Dearness Allowance) విడుదలకు సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఈ డీఏలు ఈ సెప్టెంబర్ నెల వేతనం నుంచే అమలు కానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. 2.73 శాతం డీఏను 2024 జులై 1వ తేదీ నుంచి లెక్కగట్టి చెల్లించనున్నారు. దీనికి సంబంధించిన 26 నెలల బకాయిలను 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో విడతల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే మరో 1.82 శాతం డీఏను 2025 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ డీఏకు సంబంధించిన 20 నెలల బకాయిలను 2028వ సంవత్సరం జనవరి, మార్చి, మే, జులై నెలల్లో చెల్లించనున్నట్లు తాజా ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకేసారి రెండు డీఏలు మంజూరు కావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



