|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

Bail: ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్

హైదరాబాద్, సూర్య న్యూస్ : సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ (Trainee IPS) లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఉప్పరపల్లి కోర్టు (Upparpally Court) తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ మంజూరులో భాగంగా రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

అత్తాపూర్ పీఎస్‌లో కేసు నమోదు

సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో (SVPNPA) శిక్షణ పొందుతున్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత జులై 18న అత్తాపూర్ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp