
హైదరాబాద్, సూర్య న్యూస్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ ఎన్టీఆర్ పార్క్‌లో (Pragathi Nagar NTR Park) బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. బతుకమ్మ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు ఆనందోత్సాహాలతో పాల్గొనడంతో ప్రగతినగర్ పరిసరాలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి.

ఈ పండుగ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కందుల కూచిపూడి నాట్యాలయం గురువు రవి నేతృత్వంలో ఆయన శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాట్య గురువు రవి శిక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య విన్యాసాలు స్థానికులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ నృత్య ప్రదర్శనలో నాట్యాలయం విద్యార్థులు పరుచూరి సహాన, సాన్వి సాప, తన్వి, సితార, శతరూప, సాన్వి టి, యషిక, జాన్విక, యజ్ఞశ్రీ, నైమిష, సోహా, సోనా, శ్రీహన్విక, అద్విత సాయి, ఓ లాస్య శ్రీ, వైష్ణవి, కావ్యశ్రీ, హవివన్య, యశ్విథ, హెత్విక, నైరా, రిషిత, లక్ష్మి రితిక, శ్రీవర్ణిక తదితరులు పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచారు.

ఈ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, విజయవంతంగా జరగడంలో స్థానిక మున్సిపల్ అధికారులతో పాటు పోలీస్ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తోందని బతుకమ్మ ఉత్సవాల కమిటీ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాచుపల్లి సీఐ పి.డి. నాయుడు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టి, పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పూర్తి మద్దతుగా నిలిచారని ఉత్సవ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



