|  
FLASH NEWS
Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  •  హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్  •  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు  •  జాతీయ స్థాయి నృత్యోత్సవంలో హైదరాబాద్ విద్యార్థినుల సత్తా.. పతకాల పంట పండించిన కందుల నాట్యాలయ బృందం  •  నా చావు కోరుతూ సభకు రమ్మంటున్నారు : రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్.. అసెంబ్లీ వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం  • 
Skip to content

జాతీయ స్థాయి నృత్యోత్సవంలో హైదరాబాద్ విద్యార్థినుల సత్తా.. పతకాల పంట పండించిన కందుల నాట్యాలయ బృందం

kandula natyalayam national dance festival
kandula natyalayam national dance festival

హైదరాబాద్, సూర్య న్యూస్ : బెంగుళూరులోని నయన ఆడిటోరియం (Nayana Auditorium) వేదికగా భరత కళా గ్రామ (Bharata Kala Grama) సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘నృత్య వసంతం – గురు సమర్పణ’ జాతీయ నృత్యోత్సవంలో తెలంగాణ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మందికి పైగా కళాకారులు పాల్గొన్న ఈ విశేష కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ‘కందుల కూచిపూడి నాట్యాలయ’ విద్యార్థినులు తమ అద్భుత నృత్య ప్రదర్శనలతో పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటారు.

కూచిపూడి నృత్యంలో బహుమతుల వెల్లువ

కందుల కూచిపూడి నాట్యాలయకు చెందిన పది మంది విద్యార్థినులు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సోలో, డ్యూయెట్, గ్రూప్ విభాగాల్లో బహుమతులు సాధించారు. కూచిపూడి జూనియర్స్ సోలో విభాగంలో ఎస్. ఐశ్వర్య ప్రథమ స్థానంలో నిలవగా, బి. ప్రియాంక ద్వితీయ, బి. ఆద్య తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. సబ్ జూనియర్స్ సోలో విభాగంలో డి. ఆర్న ద్వితీయ స్థానాన్ని పొందగా, పి. అద్వైత మరియు ఎం. అర్నవి తృతీయ స్థానాలను పంచుకున్నారు. జూనియర్ ట్రయో విభాగంలో ప్రియాంక, ఐశ్వర్య, ఆద్యల బృందం అద్భుత ప్రదర్శనతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, సబ్ జూనియర్స్ ట్రయో విభాగంలో ఆర్న, అర్నవి, అద్వైత బృందం రెండో స్థానంలో నిలిచారు. జూనియర్స్ గ్రూప్ పోటీల్లో అద్వైత, ఆర్న, అర్నవి, ప్రియాంక, ఐశ్వర్య బృందం ఏకంగా ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది.

సీనియర్స్ విభాగంలో అగ్రస్థానం

సీనియర్స్ కేటగిరీలోనూ హైదరాబాద్ విద్యార్థినులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సీనియర్స్ సోలో విభాగంలో ఇషా సెనోలి మొదటి స్థానాన్ని, నిధున తృతీయ స్థానాన్ని గెలుచుకున్నారు. సీనియర్స్ డ్యూయెట్ పోటీలో నిధున, ఇషా సెనోలి జంట ప్రథమ స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందారు. ఈ నృత్యోత్సవంలో వీరితో పాటు కె. విదుష రెడ్డి, హెచ్. నాగ వైష్ణవి తదితర విద్యార్థినులు కూడా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

భారతీయ నృత్య కళలను, గురు పరంపరను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో డాక్టర్ వసంత కిరణ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన కళాకారులను నిర్వాహకులు ప్రత్యేకంగా సత్కరించారు. జాతీయ వేదికపై తమ అకాడమీ విద్యార్థులు పతకాలతో సత్తా చాటడం పట్ల కందుల కూచిపూడి నాట్యాలయ వ్యవస్థాపకులు, ప్రముఖ నాట్య గురువు శ్రీ రవి కూచిపూడి హర్షం వ్యక్తం చేస్తూ, విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp