
హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ శాసనసభ (Telangana Assembly) వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగా, మొదటి కార్యక్రమంగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. తొలిరోజు ఎజెండాలో భాగంగా ప్రశ్నోత్తరాలతో పాటు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పలు కీలక నివేదికలను సభ ముందుంచనున్నారు.
సభ ముందుకు ఆడిట్ నివేదికలు
ఈ సమావేశాల్లో తెలంగాణ సమగ్ర శిక్ష (టీఎస్ఎస్) 2024-25 ఆడిట్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) 2024-25 ఆడిట్ నివేదిక కూడా సభ ముందుకు రానుంది.
హైదరాబాద్ మెట్రో వార్షిక నివేదికలు
వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు సంబంధించి ఐదు వార్షిక నివేదికలను సైతం సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికలను కంపెనీల చట్టం సెక్షన్ 395 ప్రకారం ఆయన సభకు సమర్పించనున్నారు.
శాసనసభ, శాసనమండలి ఉభయసభల సమావేశాలు ప్రారంభం కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సమావేశాల వ్యవధి, సభలో చర్చించాల్సిన అంశాలు తదితర వ్యాపార కార్యక్రమాలపై తొలిరోజు స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



