Skip to content
Home » హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం: సందడి చేసిన సమంత, సంయుక్త మీనన్, బోయపాటి శ్రీను

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం: సందడి చేసిన సమంత, సంయుక్త మీనన్, బోయపాటి శ్రీను

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తన చిరకాల ప్రేయసి కావ్య రెడ్డితో ఆదివారం ఆయన నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగిందిఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

ఎంగేజ్మెంట్ విశేషాలు:

గత కొన్నేళ్లుగా కావ్య రెడ్డితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్ ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. కావ్య రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని సమాచారం. ఆమె కుటుంబం హైదరాబాద్‌కు చెందిన ఉన్నత విద్యావంతుల కుటుంబం అని, తాతయ్య జడ్జిగా, తండ్రి న్యాయవాదిగా పనిచేస్తున్నారని తెలుస్తోంది

తారల సందడి:

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ కు స్టార్ హీరోయిన్లు సమంత, సంయుక్త మీనన్ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

వధూవరులతో పాటు సంయుక్త మీనన్, బోయపాటి శ్రీను కలిసి ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీనివాస్ ప్రస్తుతం “హైందవ”, “రామమ్”, “టైసన్ నాయుడు” వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే సాయి శ్రీనివాస్, సంయుక్త మీనన్ ‘హైందవ’ మూవీ లో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి తేదీపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *