
హైదరాబాద్, సూర్య న్యూస్ : సమాజంలో అవసరమైన వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం అని గుమ్మడి రాజలింగం ఫౌండేషన్, శ్రేష్ట ఐ క్లినిక్ అధినేత డాక్టర్ గుమ్మడి కిరణ్ (Dr Gummadi Kiran) అన్నారు. కూకట్‌పల్లి (Kukatpally) నియోజకవర్గం బాలాజీ నగర్‌కు చెందిన ఒక నిరుపేద కుటుంబ విద్యార్థికి ఆయన ఫౌండేషన్ తరఫున స్కూల్ బుక్స్, పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్, వాటర్ బాటిల్, స్కూల్ బ్యాగ్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుమ్మడి రాజలింగం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్య, ఆరోగ్యం, మానవ సేవ అనే మార్గంలో పయనిస్తూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం అందించాలన్నదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. మనం చేసే చిన్న సహాయం మరొకరి జీవితంలో పెద్ద మార్పుకు దారి తీస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు.
పిల్లలకు విద్యా సామగ్రిని అందజేయడంతో పాటు, చలికాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, నిరుపేదలకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ కిరణ్ వెల్లడించారు. చిన్నారుల ముఖాల్లో కనిపించిన చిరునవ్వులే తమ సేవలకు దక్కిన నిజమైన బహుమతి అని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ సమాజానికి అండగా నిలిచేలా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



