|  
● FLASH NEWS
Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  • 
Skip to content

DMHO Hyderabad Recruitment : హైదరాబాద్ బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాల జాతర.. అర్హతలు, దరఖాస్తు పూర్తి వివరాలు ఇవే!

dmho-hyderabad-recruitment
dmho-hyderabad-recruitment

Hyderabad, Surya News: తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ పరిధిలోని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్య అధికారి (DM&HO Hyderabad) కార్యాలయం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM NUHM) కింద నగరంలోని పలు బస్తీ దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 73 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 24 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 49 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 52,000 గౌరవ వేతనం అందుతుంది. అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులకు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి నెలకు రూ. 29,900 జీతంగా నిర్ణయించారు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డీడీని డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ, హైదరాబాద్ పేరిట జాతీయ బ్యాంకు నుంచి తీసుకోవాలి.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులను జతచేసి నేరుగా సమర్పించాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం ఆగస్టు 20 నుంచి ఆగస్టు 22 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆగస్టు 24, 25 తేదీలలో ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య సికింద్రాబాద్ పాట్నీలోని జీహెచ్ఎంసీ భవనం 4వ అంతస్తులో గల డీఎంఅండ్‌హెచ్ఓ కార్యాలయంలో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు, అధికారిక దరఖాస్తు నమూనా కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్ www.hyderabad.telangana.gov.in పరిశీలించగలరు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp