|   
🔴 BREAKING NEWS ► NBK 111 Shooting : కాకినాడ పోర్టులో షూటింగ్.. నందమూరి బాలకృష్ణకు ప్రమాదం.. HYDRA Commissioner : సంచలనం.. హైడ్రా రంగనాథ్ అరెస్ట్ కు హైకోర్టు ఆదేశం Indian Railway Jobs : రైల్వేలో కొలువుల జాతర.. 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు బిగ్ నోటిఫికేషన్.. జీతం, అర్హతలు ఇవే Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య Shocking News : అర్ధరాత్రి రోడ్డుపై నగ్నంగా యువతి పరుగులు – చివరిసారిగా దేవుడికి దండం పెట్టుకుని నేరుగా చెరువులోకి
Skip to content

CCRUM Jobs 2026 : కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖలో 179 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

హైదరాబాద్, సూర్య న్యూస్: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్ (CCRUM) నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. సంస్థలో ఖాళీగా ఉన్న 179 మెడికల్, నాన్-మెడికల్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్-ఏ విభాగంలో 19, గ్రూప్-బీ విభాగంలో 37, గ్రూప్-సీ విభాగంలో 123 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష (CBT), స్కిల్ టెస్టుల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

స్టాఫ్ నర్సు (Staff Nurse): మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ (ఆనర్స్) లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎంతో పాటు ఏడాది ఉద్యోగానుభవం తప్పనిసరి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ. 44,900 నుండి రూ. 1,42,400 వరకు వేతనం చెల్లిస్తారు.

మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ (MLT): మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ) తో పాటు రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. వేతన శ్రేణి నెలకు రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు ఉంటుంది.

ఫార్మసిస్ట్ (Pharmacist): మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ పాసై, రెండేళ్ల ఫార్మసీ డిప్లొమా చేసి ఉండాలి. రాష్ట్ర లేదా కేంద్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యత్వం తప్పనిసరి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ. 29,200 నుండి రూ. 92,300 వేతనం లభిస్తుంది.

స్టెనోగ్రాఫర్ (Stenographer): మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు షార్ట్ హ్యాండ్ లో నిమిషానికి 80 పదాలు, టైప్ రైటింగ్ లో నిమిషానికి 40 పదాల వేగం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. డిగ్రీ చదివినవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 28 సంవత్సరాలు మించకూడదు. నెలకు రూ. 25,500 నుండి రూ. 81,100 వేతనం ఉంటుంది.

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC): మొత్తం 26 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాల టైపింగ్ వేగం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ. 19,900 నుండి రూ. 63,200 వేతనం ఉంటుంది.

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS): ఈ విభాగంలో (మెసెంజర్, వార్డ్ బాయ్, ఫిమేల్ అటెండెంట్, ఆయా, ల్యాబ్ అటెండెంట్, ఫార్మసీ అటెండెంట్) మొత్తం 43 ఖాళీలు ఉన్నాయి. అర్హతగా పదోతరగతి, లేదా ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ. 18,000 నుండి రూ. 56,900 వేతనం ఇస్తారు.

​గ్రూప్-ఏ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. సీబీటీకి 70 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావుమార్కు (1/4) కోత విధిస్తారు.

స్టాఫ్ నర్సు, ఎంఎల్‌టీ, స్టెనోగ్రాఫర్, యూడీసీ, ఎల్డీసీ, ఎంటీఎస్ పోస్టులకు సీబీటీ 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో సబ్జెక్టుకు 70 మార్కులు, జనరల్ అవేర్ నెస్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ కు 20 మార్కులు, ఐటీ, కంప్యూటింగ్ కు 10 మార్కులు ఉంటాయి.

సీబీటీలో అర్హత సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో స్కిల్ టెస్టుకు పిలుస్తారు.

అన్ని పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్సీఎల్ కు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

Processing Fee: అన్ని గ్రూపులకు ₹500 (అందరికీ)

Examination Fee (UR/OBC):

గ్రూప్-ఏ: అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు రూ. 1500.​

గ్రూప్-బీ: అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు రూ. 1000.

​గ్రూప్-సీ: అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు రూ. 800.

​ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwD), ఈడబ్ల్యూఎస్ (EWS), మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు రూ. 500 మాత్రమే.

​ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2026.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్లు: https://ccrum.res.in/ మరియు https://ccrum.ayush.gov.in/.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp