
హైదరాబాద్, ఫిబ్రవరి 20: ‘ఈనాడు’ దినపత్రికలో ‘ఇదీ సంగతి’ శీర్షికతో కార్టూన్లు గీసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సమాచార ప్రచార విభాగానికి సలహాదారుగా ఆయనను నియమించింది. ఈ నియామకం కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్ల ప్రాథమిక కాలానికి జరిగింది.

ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, శ్రీధర్ రావు సమాచార వ్యవస్థలను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా మీడియా రంగంలో సేవలందించిన ఆయన, ‘ఈనాడు’లో 30 ఏళ్లకు పైగా పనిచేసి, సమకాలీన సంఘటనలను విశ్లేషణాత్మక కార్టూన్లుగా మలచడంలో ప్రత్యేకత సంపాదించుకున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన శ్రీధర్ రావు మీడియా నుంచి ప్రభుత్వ సర్వీసుల్లోకి అడుగుపెట్టడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వేడుకలో కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ నేతలు పాల్గొననున్నారు.
సూర్య న్యూస్ తెలుగు టీమ్ నుంచి శ్రీధర్ గారికి హార్దిక శుభాకాంక్షలు. ఈ నియామకం మీడియా & ప్రభుత్వ సమన్వయానికి మరింత బలం చేకూర్చుతుందా? మీ అభిప్రాయాలు కామెంట్లలో తెలపండి!