
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని మహారాజా గార్డెన్ లో మహిళా సాధికారతను చాటిచెప్పే విధంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు- డీఎంఎస్ మిత్ర పవర్ కేపీహెచ్‌బీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో సుమారు 70 కి పైగా మహిళా పారిశ్రామికవేత్తల స్టాల్స్ ను మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు-

మహిళా ఆర్థికాభివృద్ధే లక్ష్యం
ఈ సందర్భంగా సొంటిరెడ్డి పునారెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఇలాంటి వేదికలను కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు- ఈ స్టాల్స్ ద్వారా మహిళా సోదరీమణులు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించే అవకాశం లభిస్తుందని దీనివల్ల అటు ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుతాయని ఇటు మహిళలకు ఉపాధి మెరుగుపడుతుందని వివరించారు- మహిళలు వంటింటికే పరిమితం కాకుండా తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించి సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మద్దతు
వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న మహిళలకు తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు- రాబోయే రోజుల్లో ఇలాంటి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని వెల్లడించారు- నియోజకవర్గంలో ఎక్కడ ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించినా ట్రస్ట్ తరపున అండగా ఉండి ఆర్థికంగా అలాగే సామాజికంగా తోడ్పాటు అందిస్తామని పునారెడ్డి స్పష్టం చేశారు- ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.