
హైదరాబాద్, సూర్య న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ (Jani Master), శేఖర్ మాస్టర్ (Sekhar Master) వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో (Telugu Film Dancers Association) ఎన్నికలు, సభ్యత్వ అంశాలపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఫెడరేషన్ అనుమతి లేకుండానే అసోసియేషన్‌లో బైఎలక్షన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశంపై ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశం కాస్త ఉద్రిక్తంగా మారింది.
ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన పలు అంశాలపై కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదానికి నిరసనగా దాదాపు 10 మంది డాన్సర్లు (Dancers) తమ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రాజీనామాలపై ఇప్పటివరకు అసోసియేషన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే జానీ మాస్టర్ లేదా శేఖర్ మాస్టర్ కూడా ఈ వ్యవహారంపై బహిరంగంగా స్పందించలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాదం ఎలా ముగుస్తుందో, అసోసియేషన్ లేదా ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననేది ఆసక్తికరంగా మారింది.
🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు




