Skip to content
Home » కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల జస్వంత్ రావు రంజాన్ సందడి: ముస్లిం సోదరుల విందులో పాల్గొన్న దేశాల్!

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల జస్వంత్ రావు రంజాన్ సందడి: ముస్లిం సోదరుల విందులో పాల్గొన్న దేశాల్!

కూకట్‌పల్లి, సూర్య న్యూస్ : కూకట్‌పల్లి నియోజకవర్గంలో రంజాన్ (Eid-ul-Fitr) పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలు కాలనీలలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక రంజాన్ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు దేశాల్ మిత్రమండలి వ్యవస్థాపకులు శ్రీ గొట్టిముక్కల జస్వంత్ రావు (దేశాల్) పాల్గొన్నారు.​

స్థానిక ముస్లిం సోదరులు చిన్ను పాషా, సాబెర్, షౌకత్, అజ్జు మరియు సమీర్ గారి ఆహ్వానం మేరకు జస్వంత్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని, వారితో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులందరికీ ‘ఈద్-ఉల్-ఫితర్ ముబారక్’ (Eid Mubarak) తెలియజేశారు. అల్లాహ్ తాలా అందరికీ శాంతి, సౌభాగ్యం మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ములుగు భీమ్ రావు మరియు దేశాల్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.