Skip to content
Home » Jobs Alert : గోవా షిప్యార్డ్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు.. బీఈ/బీటెక్ చేసిన వారికి సూపర్ ఛాన్స్!

Jobs Alert : గోవా షిప్యార్డ్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు.. బీఈ/బీటెక్ చేసిన వారికి సూపర్ ఛాన్స్!

పనాజీ, సూర్య న్యూస్: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని గోవా షిప్యార్డ్ లిమిటెడ్ (GSL) నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్ (Manager), డిప్యూటీ మేనేజర్ (Deputy Manager) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 మేనేజర్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు.​

మేనేజర్ – వెపన్స్, మెయిన్ ప్రొపల్షన్ & షాఫ్టింగ్.​

డిప్యూటీ మేనేజర్ – ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ & కమ్యూనికేషన్స్, హల్ ఫిట్టింగ్ వంటి వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు (Eligibility):

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ (BE) లేదా బీటెక్ (B.Tech) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులకు సంబంధిత రంగంలో పని అనుభవం (Experience) ఉండాలి. గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం & దరఖాస్తు:

అభ్యర్థుల విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, అనంతరం ఇంటర్వ్యూ (Interview) నిర్వహించి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమైంది. ఏప్రిల్ 22వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఫీజు రూ. 500 కాగా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. పూర్తి వివరాలకు goashipyard.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.