|  
● FLASH NEWS
VijayDeverakonda: ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్  •  Nobel: భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌పై సెటైర్లు  •  Bypolls: ముస్లిం మెజార్టీ స్థానాల్లో బీజేపీ హవా  •  KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!  •  NFSC : ఫెలోషిప్‌ల జాప్యంపై యువ న్యాయవాది పోరాటం  • 
Skip to content

KCR: సీఎం రేవంత్‌పై వ్యూహం మార్చిన కేసీఆర్.. టార్గెట్ కొడంగల్!

హైదరాబాద్, సూర్య న్యూస్ : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ దాడిని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేసీఆర్ సరికొత్త రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ దూకుడు పెంచాలని నిర్ణయించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేతల నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతుండటంతో, దానికి దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ బాస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కేవలం ముఖ్యమంత్రి నియోజకవర్గమే కాకుండా, రాష్ట్రంలోని కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ వరుసగా సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp