Skip to content
Home » కుత్బుల్లాపూర్ : గాంధీనగర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు – ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ : గాంధీనగర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు – ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్, సూర్య న్యూస్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ రాయల్ ప్యాలెస్‌లో శనివారం ఆత్మీయ ఇఫ్తార్ విందు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర NSUI నాయకుడు గొల్ల జాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గొల్ల జాన్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ఉపవాసం, ప్రార్థనలు, దానం మరియు సహనానికి ప్రతీక అని కొనియాడారు. సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఇలాంటి ఇఫ్తార్ విందులు కీలక పాత్ర పోషిస్తాయని, అన్ని మతాల ప్రజలు కలిసి పాల్గొనడం సామాజిక ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. మైనారిటీ సోదరులందరికీ ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కూన శ్రీశైలం గౌడ్, గొల్ల జాన్ ఇతర నాయకులతో కలిసి ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మైనారిటీ సోదరులతో కలిసి ఉపవాస దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నక్క ప్రభాకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ముస్లిం మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.