|  
● FLASH NEWS
Konaseema: తెల్లవారుజామున పెద్ద శబ్దం.. గ్రామస్తులు ఎందుకు ఇళ్లు ఖాళీ చేశారో తెలుసా?  •  Akvan: నవంబర్ 20న ఆంధ్ర తీరం దాటనున్న అక్వాన్ తుపాను.. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్  •  Quad: మనీలాలో క్వాడ్ సమావేశం.. మోదీని ‘చాలా గట్టివాడు’ అని ప్రశంసించిన ట్రంప్  •  Dhoni: ఐపీఎల్ ఆటకు ధోని వీడ్కోలు.. చెన్నై సూపర్ కింగ్స్ మార్గదర్శకుడిగా మహి  •  Charlapalli Fire: కరెంట్ కనెక్షనే లేని బోగీలో మంటలు ఎలా?.. చర్లపల్లి స్టేషన్‌లో భయానక అగ్నిప్రమాదం  • 
Skip to content

Osmania: ఓయూ ఆర్ట్స్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ బి.విజయ

హైదరాబాద్, సూర్య న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఆర్ట్స్ కళాశాల (Arts College) నూతన ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ బి.విజయ (Prof B Vijaya) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం నుంచి ఆమె ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ విభాగాల అధిపతులు, చైర్మన్లు, అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగులు ప్రొఫెసర్ విజయకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా సన్మానం

రెండేళ్ల పాటు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించిన ప్రొఫెసర్ సి.కాశీంను నూతన ప్రిన్సిపాల్ విజయ పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. అనంతరం కళాశాలలోని 121 హాల్‌లో ప్రొఫెసర్ కాశీంకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆచార్యులు, అధికారులు, ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కాశీం కళాశాలకు చేసిన సేవలను కొనియాడారు.

వ్యవస్థ బాగు కోసమే పనిచేశా: ప్రొఫెసర్ కాశీం

తన రెండేళ్ల పదవీకాలంలో వ్యవస్థ బాగు కోసమే పనిచేశానని ప్రొఫెసర్ సి.కాశీం స్పష్టం చేశారు. వ్యవసాయంలో కలుపు మొక్కలను ఏరివేస్తేనే పంట బాగా పండుతుందని, అలాగే వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ఆర్ట్స్ కళాశాలలో విద్య, పరిశోధనలను మెరుగుపరిచేందుకు తాను ఎంతగానో కృషి చేశానని ఆయన వివరించారు. ఒక అధ్యాపకుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించడమే తన మొదటి ప్రాధాన్యమని, అధ్యాపకులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఉత్తమ విద్యకు కృషి చేస్తా: ప్రొఫెసర్ బి.విజయ

విద్య, పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు తన వంతు కృషి చేస్తానని నూతన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.విజయ పేర్కొన్నారు. అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల భాగస్వామ్యంతో ఆర్ట్స్ కళాశాలను అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తానని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.స్వాతి, కళాశాల సహాయ రిజిస్ట్రార్ శ్రీనాథ్, సూపరింటెండెంట్ అపర్ణ, వివిధ విభాగాల అధిపతులు, పాఠ్య మండళ్ల చైర్మన్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp