
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మూడో భార్య అన్నా లెజినోవాతో (Anna Lezhneva) విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.
పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు వెల్లడి
తాము ఇద్దరం పరస్పర అంగీకారం, గౌరవంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ నోట్‌లో స్పష్టం చేశారు. తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా కొనసాగుతామని, అలాగే తమ పిల్లల పట్ల బాధ్యతగల తల్లిదండ్రులుగా ఉంటామని వారు తెలిపారు. తమ నిర్ణయాన్ని గౌరవించి, తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని అభిమానులను, ప్రజలను కోరారు. ఇప్పటివరకు తమ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
స్నేహం నుంచి వివాహ బంధం వరకు
పవన్ కల్యాణ్ నటించిన ‘తీన్‌మార్’ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు అన్నా లెజినోవాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, వివాహానికి దారితీసింది. అయితే, కొద్దిరోజుల క్రితమే అన్నా లెజినోవా విదేశాలకు వెళ్లిపోయారని, అలాగే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా డీయాక్టివేట్ చేశారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా జనసేన అఫీషియల్ వాట్సాప్ గ్రూపులో విడాకుల ప్రకటన విడుదల కావడంతో ఈ వార్తలకు ముగింపు పలికినట్లయింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



