Skip to content
Home » ఆయన లాంటి మనిషి ఇండియాలో నే కాదు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు – ప్రభాస్ కామెంట్స్ వైరల్

ఆయన లాంటి మనిషి ఇండియాలో నే కాదు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు – ప్రభాస్ కామెంట్స్ వైరల్

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి సాధారణంగా తక్కువగా మాట్లాడే ప్రభాస్.. ఒక టాలెంటెడ్ డైరెక్టర్ గురించి ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఆయనలాంటి వారు ఈ ప్రపంచంలోనే లేరని కొనియాడారు

కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రమోషన్లలో ప్రభాస్​సంతోష్ శోభన్ మరియు మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ పాల్గొని యూవీ క్రియేషన్స్ టీమ్‌తో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

ఆయనలా రాయగలిగే డైరెక్టర్ ఎవరూ లేరు

పూరి జగన్నాథ్ రాసే హీరో క్యారెక్టరైజేషన్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ఆయనలా హీరో పాత్రను డిజైన్ చేయగలిగే డైరెక్టర్ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని ప్రశంసించారు పూరి దర్శకత్వంలో తాను చేసిన ‘బుజ్జిగాడు’ మరియు ‘ఏక్ నిరంజన్’ సినిమాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ముఖ్యంగా బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి క్యారెక్టర్స్ తన ఇమేజ్ కి చాలా హెల్ప్ప్ర చేశాయని ప్రభాస్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ అయినా తనతో పని చేసిన డైరెక్టర్స్ ను గుర్తు పెట్టుకుని ఇలా ఆకాశానికి ఎత్తడం మా డార్లింగ్ కే సాధ్యమని అభిమానులు కొనియాడుతున్నారు.

ఫౌజి లేదా స్పిరిట్ లుక్ కావచ్చా?​

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టుల నేపథ్యంలో ఈ లుక్‌పై ఆసక్తికరమైన అంచనాలు ఉన్నాయి.

ఫౌజి (Fauji): హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా రానుంది. అందులో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపిస్తారని సమాచారం. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెంచిన గడ్డం మరియు హెయిర్ స్టైల్ చూస్తుంటే, ఇది ‘ఫౌజి’ చిత్రానికి సంబంధించిన వింటేజ్ లుక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు భావిస్తున్నారు.​

స్పిరిట్ (Spirit): సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున, ప్రస్తుతానికి ఇది ఫౌజి లుక్ అని నెటిజన్లు ఎక్కువగా నమ్ముతున్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *