|   
🔴 BREAKING NEWS ► PM Modi Latest Video : మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. Supreme Court Guidelines : కోర్టు వీడియోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు Police Job Aspirant Arrested : నిరుద్యోగుల బంద్ ఎఫెక్ట్.. హాస్టల్ వద్దే పోలీస్ అభ్యర్థి నవీన్ పట్నాయక్ అరెస్ట్ Delhi Police Warning : ఆందోళనకారులకు ఢిల్లీ పోలీసుల సంచలన వార్నింగ్.. ఆ తప్పు చేశారో ఇక మీ పాస్‌పోర్ట్ రద్దే Nandamuri Balakrishna Knee Surgery : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య మోకాలి ఆపరేషన్ సక్సెస్
Skip to content

రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారులు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి మరియు అధికార ప్రతినిధి, డీసీసీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నరేందర్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు.

రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతం కావాలని ఆకాంక్ష:

Surya News Logo
మరిన్ని బ్రేకింగ్ వార్తల కోసం
Surya News WhatsApp Channel లో జాయిన్ అవ్వండి
Join

ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆయన రాజకీయ ప్రయాణం మరింత విజయవంతం కావాలని, రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నాయకులు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులుగా ఉన్న నరేందర్ రెడ్డి ఎన్నిక పట్ల నియోజకవర్గ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు:

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవరెడ్డి, కే ఏం గౌరీష్, బట్ట పాలకృష్ణ, గడ్డం రాజేందర్ రెడ్డి, మన్నే రాజు, లక్ష్మ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, రషీద్, ఆలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp