
కొంపల్లి, సూర్య న్యూస్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఈద్ కా తోఫా” (రంజాన్ కానుక) పంపిణీ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. నియోజకవర్గంలోని కొంపల్లి మరియు బహదూర్ పల్లి మసీదుల వద్ద శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మసీదు కమిటీల సమక్షంలో అర్హులైన ముస్లిం కుటుంబాలకు ఆయన దుస్తులు మరియు నిత్యావసర వస్తువులతో కూడిన తోఫాలను పంపిణీ చేశారు.
సోదరభావానికి ప్రతీక రంజాన్ : కొలన్ హన్మంత్ రెడ్డి
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ పండుగ సోదరభావం, సహనం మరియు సేవా భావానికి ప్రతీక అని కొనియాడారు. పేద ముస్లిం కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కానుకలను అందిస్తోందని, ఇది వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరూ రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, లేబర్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మైసి గారి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ గోపాల్ రెడ్డి, ఆదిరెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మాజీ కోఆప్షన్ సభ్యులు షైక్ ఇబ్రహీం, పూర్ణచందర్ రావు, జయభేరి గోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అంజి ముదిరాజ్, కుంట శ్రీనివాస్, మసీదు కమిటీ అధ్యక్షులు మహ్మద్, సభ్యులు షైక్ ఖాదీర్, సలీం, మైబలి, జహంగీర్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని స్థానిక వార్తల కోసం suryanews.in ని ఫాలో అవ్వండి.