
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్‌కు పలువురు వినతి పత్రాలు అందజేశారు. సోమవారం కుత్బుల్లాపూర్‌లోని తన నివాస కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండగా, నియోజకవర్గంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు సంక్షేమ సంఘాల సభ్యులు ఆయనను కలిశారు.

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
ఈ సందర్భంగా వివిధ కాలనీల నుండి వచ్చిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు సంబంధించిన ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా ఆయనకు అందించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.