Skip to content
Home » దూలపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర: పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

దూలపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి జాతర: పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ

దూలపల్లి, సూర్య న్యూస్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ పరిధిలోని దూలపల్లి డివిజన్‌లో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ జాతర కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శంభీపూర్ క్రిష్ణ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక కల్యాణార్థం కొలిచే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి జాతరలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులందరికీ ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు దేవేందర్ యాదవ్, రవీందర్ (సంజీవ్) యాదవ్, పాక్స్ డైరెక్టర్ జీతయ్య పాల్గొన్నారు. వారితో పాటు దుండిగల్ సర్కిల్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ శామీర్పేట్ రంగయ్య, దుండిగల్ సర్కిల్ యూత్ అధ్యక్షులు మైసిగారి శ్రీకాంత్, స్థానిక నాయకులు పెంటయ్య యాదవ్, రమేష్ యాదవ్, దేవేందర్ యాదవ్, పవన్ యాదవ్, యాదయ్య యాదవ్, మదన్ యాదవ్, నరేందర్ యాదవ్, శ్రీశైలం యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

మీ అభిప్రాయం తెలియజేయండి.