|  
● FLASH NEWS
PawanKalyan: పల్లె పండుగ రోడ్డు ధ్వంసం.. పవన్ కళ్యాణ్ సీరియస్  •  StockMarket: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  •  Ambati: మా ప్రభుత్వం వస్తే హోంమంత్రిని నేనే.. పోలీసులకు మాజీ మంత్రి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!  •  H1B: వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలి.. వారు ‘చీప్ లేబర్’  •  Imran Khan: భారతీయుడివి కానప్పుడు నీకీ ఆందోళనలు ఎందుకు? బాలీవుడ్ హీరోపై విమర్శల వెల్లువ  • 
Skip to content

SheetalDevi: ప్రపంచ రికార్డును సమం చేసిన శీతల్ దేవి

Pic Source : X

సూర్య న్యూస్ డెస్క్ : జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్‌లో (Asian Para Games) భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) సంచలన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్‌లో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఆమె, ప్రపంచ రికార్డును సమం చేసి మొదటి స్థానంలో నిలిచింది.

మొత్తం 720 పాయింట్లకు గాను శీతల్ దేవి ఏకంగా 704 పాయింట్లు సాధించి ఈ అరుదైన ఘనతను నమోదు చేసింది. గతంలో 2024 పారిస్ పారాలింపిక్స్‌లో టర్కీకి చెందిన ఆర్చర్ ఓజ్నూర్ గిర్డి నెలకొల్పిన 704 పాయింట్ల ప్రపంచ రికార్డును శీతల్ ఇప్పుడు సమం చేసింది. ఈ క్రమంలో ఆమె 57 పర్ఫెక్ట్ 10లను నమోదు చేయగా, అందులో 32 సార్లు బాణం నేరుగా బుల్స్ ఐ (Xs) లోకి దూసుకెళ్లడం విశేషం. అంతేకాకుండా, ఈ ఏడాది మార్చిలో బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈవెంట్‌లో తను నెలకొల్పిన 698 పాయింట్ల ఆసియా రికార్డును కూడా శీతల్ అధిగమించి సరికొత్త ఆసియా రికార్డును లిఖించింది.

భారత్‌కు తిరుగులేని ఆధిక్యం

ఇదే క్వాలిఫికేషన్ రౌండ్‌లో పాల్గొన్న మరో భారత ఆర్చర్ పాయల్ నాగ్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆమె మొత్తం 675 పాయింట్లు సాధించి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచింది. శీతల్ దేవి, పాయల్ నాగ్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా 1,379 పాయింట్లు సాధించడంతో మహిళల కాంపౌండ్ టీమ్ క్వాలిఫికేషన్‌లోనూ భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp