
హైదరాబాద్, సూర్య న్యూస్ : దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన షూటింగ్ భాగాన్ని నిన్నటితో పూర్తి చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు
మిగిలిన షూటింగ్ భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్లో కనిపించనున్నారు. రాజమౌళి మార్క్ టేకింగ్తో రాబోతున్న ఈ విజువల్ వండర్ తదుపరి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
2027లో గ్రాండ్ రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



