ఈనాడు మాజీ కార్టూనిస్ట్ శ్రీధర్‌కు ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి: ‘ఇదీ సంగతి’ నుంచి సమాచార విభాగంలోకి!
ప్రముఖ ‘ఈనాడు’ మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార ప్రచార విభాగ సలహాదారుగా నియమించింది. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్ల ప్రాథమిక కాలానికి ఈ నియామకం జరిగింది. 30 ఏళ్ల మీడియా అనుభవం ఉన్న శ్రీధర్, ప్రభుత్వ సమాచార వ్యవస్థలను మరింత పటిష్టం చేయనున్నారు.
