రియల్ ‘ధురంధర్’ మేజర్ మోహిత్ శర్మ వర్ధంతి నేడు: ఉగ్రవాదిగా మారి మృత్యువును ముద్దాడిన అజేయ వీరుడి సాహసగాథ!
దేశ రక్షణ కోసం ఉగ్రవాదిగా మారి, శత్రువుల స్థావరాల్లోనే తిరుగుతూ సమాచారాన్ని సేకరించిన ఆ అజేయ వీరుడు మేజర్ మోహిత్ శర్మ వర్ధంతి నేడు. సరిగ్గా ఇదే రోజు (మార్చి 21, 2009) కశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో వీరమరణం పొందారు. ఆయన సాహసోపేతమైన సాహసాలు ఇప్పుడు ‘ధురంధర్’ సినిమా ద్వారా మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
