Skip to content

పెంజర్లలో పెను ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి బాణసంచా లారీ దహనం – తృటిలో తప్పిన భారీ ప్రాణనష్టం!

రంగారెడ్డి పెంజర్లలో క్రాకర్స్ లోడు లారీ విద్యుత్ తీగలు తగిలి దహనం - భీభత్సమైన దృశ్యం.

రంగారెడ్డి జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొత్తూర్ మండలం పెంజర్లలో బాణసంచా (క్రాకర్స్) లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగులడంతో దహనమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పినా, భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.