జాతీయ పామ్ బోర్డు ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి కుమారస్వామికి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వృత్తిదారులకు ఉపాధి కల్పించేలా జాతీయ పామ్ బోర్డును ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిసి నీరా పాలసీపై చర్చించారు.
