Skip to content

సింగరేణి కార్మికుల గౌరవం పెంచేలా కీలక నిర్ణయం: ‘బదిలీ వర్కర్’ హోదా ఇక గతం

సింగరేణి పర్సనల్ విభాగం జారీ చేసిన అధికారిక సర్క్యులర్.

సింగరేణి కార్మికుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సంస్థలో ఇకపై ‘బదిలీ వర్కర్’ అనే పదం వినిపించదు. ఈ హోదాను ‘జనరల్ అసిస్టెంట్ ట్రెయినీ’గా మారుస్తూ సింగరేణి యాజమాన్యం చారిత్రక ఉత్తర్వులు జారీ చేసింది. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు, కార్మికులకు సామాజికంగా గౌరవప్రదమైన గుర్తింపునిచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుంది.

చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: నాగబాబు భరోసా

బాధిత చిరువ్యాపారి వలితో కలిసి ఉన్న ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు.

చిరువ్యాపారులపై దాడులు చేయడం సరికాదని జనసేన నేత నాగబాబు అన్నారు. కోవాబన్ విక్రేత వలికి ఆర్థిక సాయం అందించి, కూటమి ప్రభుత్వం పేద వ్యాపారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన: ఏపీ టెక్నాలజీ భవిష్యత్తుకు సరికొత్త దిశ!

గన్నవరం విమానాశ్రయంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న మంత్రి నారా లోకేష్.

అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన సందడి నెలకొంది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఏఐ పాలన, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు కుదుర్చుకోనుంది.