ప్రగతి నగర్లో అగ్నిప్రళయం: కళ్లముందే బూడిదైన వ్యాపారుల కలలు.. 50 ఫర్నిచర్ షాపులు దగ్ధం!
ప్రగతి నగర్ కేజీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఫర్నిచర్ మార్కెట్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మంటల దాటికి సుమారు 50 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదవ్వగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. చిరు వ్యాపారుల జీవనాధారం దెబ్బతిన్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
