Skip to content
Home » ​టీజీఎస్‌ఆర్‌టీసీ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న: కార్మికుల సంక్షేమమే లక్ష్యం

​టీజీఎస్‌ఆర్‌టీసీ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న: కార్మికుల సంక్షేమమే లక్ష్యం

హైదరాబాద్: టీజీఎస్‌ఆర్‌టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియమితులయ్యారు శనివారం రోజున అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న హరికిషన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు తీన్మార్ మల్లన్నను ఆయన కార్యాలయంలో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు

బీసీ కార్మికుల సమస్యలపై మల్లన్న హామీ

ఆర్టీసీలో దాదాపు 20 వేల మంది బీసీ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని.. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ జీవోలు ఉన్నప్పటికీ గ్రీవెన్స్ సమావేశాలు నిర్వహించడం లేదని ప్రతినిధులు మల్లన్న దృష్టికి తీసుకెళ్లారు ఇందుకు స్పందించిన తీన్మార్ మల్లన్న.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మరియు బీసీ ఉద్యోగుల హక్కుల సాధనకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు

కొత్త అధ్యక్షుడిగా సంపత్ ముదిరాజ్ ఎన్నిక

​ఇదే సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రాణిగంజ్ డిపోకు చెందిన సంపత్ ముదిరాజ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు త్వరలోనే రాష్ట్ర మరియు జోనల్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని.. అనంతరం వీసీ అండ్ ఎండీని కలిసి కార్మిక సమస్యలపై వినతిపత్రం అందజేస్తామని పున్న హరికిషన్ ప్రకటించారు

పాల్గొన్న ప్రతినిధులు

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ చైర్మన్ గుండ్ల ఆంజనేయులు గౌడ్, జనరల్ సెక్రటరీ పున్నా హరికిషన్, నాయకులు రాములు గౌడ్, రామేశ్వరం, పాండు యాదవ్, ఆంజనేయులు, నగేష్ తదితరులు పాల్గొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఘనంగా సన్మానించారు

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *